మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రి రోజా..!

Published on Apr 30, 2022 1:40 am IST


ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా సెల్వమణి ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి చేపట్టాక శాఖపరమైన రివ్యూలతో బీజీగా ఉన్న రోజా తాజాగా కుటుంబ సమేతంగా కలిసి జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లింది. రోజా దంపతులను చిరంజీవి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. అనంతరం ఆమె మంత్రి పదవి అందుకున్నందుకు చిరంజీవి రోజా దంపతులను సన్మానించారు. కొద్దిసేపు ఇరు కుటుంబాలు ముచ్చటించుకున్నాయి.

“కుటుంబ సమేతంగా చిరంజీవిగారిని కలవడం చాలా సంతోషాన్నిచ్చింది. సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్యూ చిరంజీవి గారు” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అంతకు ముందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా రోజా దంపతులు కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రి రోజాకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

సంబంధిత సమాచారం :