టాలీవుడ్ హీరోలు, నిర్మాతలకి విజయ సాయి రెడ్డి రిక్వెస్ట్.!

Published on Oct 1, 2022 10:03 am IST

ప్రస్తుతం మళ్ళీ టాలీవుడ్ సినిమాలు మంచి రెస్పాన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు అందుకుంటూ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఇక అలాగే పలు చిత్రాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగడం సర్వ సాధారణం అని అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల కొన్ని పరిస్థితులు మారడంతో ఏపీ నుంచి అయితే టాలీవుడ్ కి కొన్ని సూచనలు వచ్చాయి.

దీనితో షూటింగ్ సహా కొన్ని అంశాల్లో మార్పులు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు సహా నాగ్ లు నటించిన చిత్రాలు తాలూకా ప్రీ రిలీజ్ లు ఏపీలోనే జరగడంతో ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తూ టాలీవుడ్ హీరోలు మరియు నిర్మాతలకి ఓ రిక్వెస్ట్ పెడుతున్నారు.

టాలీవుడ్ చిత్రాలకు 60% మార్కెట్ ఏపీ కాబట్టి…హీరోలు, నిర్మాతలు చొరవ తీసుకొని సినిమా ఈవెంట్లు, షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించాలి. అని తెలిపారు. ఇప్పటికే చాలానే సినిమాలు పెద్ద మొత్తంలో ఏపీలోనే షూటింగ్స్ జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో అయితే ఇది మరింత స్థాయిలో వెళ్లడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :