ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్-19 గైడ్ లైన్స్!

Published on Jan 10, 2022 3:00 pm IST

దేశ వ్యాప్తంగా మరొకసారి కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొన్ని ఆంక్షలను పెట్టడం జరిగింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తాజాగా కోవిడ్-19 గైడ్ లైన్స్ ను ప్రకటించడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాత్రి కర్ఫ్యూ విధించడం జరిగింది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. థియేటర్లు 50 శాతం ఆక్యూపెన్సి తో సినిమాలు ప్రదర్శింపబడనున్నాయి. మాల్స్ లో సైతం 50 శాతం ఆక్యుపెన్సి తో నడవనున్నాయి. అంతేకాక శుభకార్యాలకు 200 మందికి మించి ఎక్కువ ఉండకూడదు. ఈ తరహా గైడ్ లైన్స్ ను ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :