వరుణ్ ప్లానింగ్ కి ముచ్చట పడ్డ మెగాస్టార్ !


వరుణ్ తేజ్ తాజా చిత్రం మిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.గత రాత్రి ఈ వేడుక జరిగింది.మిస్టర్ చిత్రం రొమాంటిక్ ఎంటైర్ టైనర్ గా త్వరలో విడుదల కానుంది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ వరుణ్ భిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడని అభినందించారు. వరుణ్ నటించిన కంచె, లోఫర్ మరియు ఇప్పుడు తాజా వస్తున్న చిత్రం మిస్టర్ అన్ని విభిన్నమైన చిత్రాలని చిరు అన్నారు. మెగా ఫ్యామిలీ మీద మెగా అభిమానుల మీద ఎక్కువగా ఆధార పడకుండా కష్టపడాలని వరుణ్ కు చిరు సూచించారు.

శ్రీనువైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి,హెబా పటేల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఏప్రిల్ 14 న ఈచిత్రం విడుదల కానుంది.