ఏప్రిల్ 28 : టాలీవుడ్‌కు వెరీ వెరీ స్పెషల్.. ఎన్ని బ్లాక్‌బస్టర్స్‌కు కేరాఫో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏప్రిల్ 28 కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ తేదీన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే, అందులో కొన్ని ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలు కాగా, మరికొన్ని కెరియర్ నిలబెట్టిన సినిమాలు. మరి ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి టాలీవుడ్ స్థాయిని పెంచి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

అడవి రాముడు :
లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘అడవి రాముడు’ 1977 ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్‌కు సరికొత్త కమర్షియల్ అంశాలను పరిచయం చేసింది. సామాజిక, పౌరాణిక చిత్రాలతో మెప్పించిన ఎన్టీఆర్, ‘అడవి రాముడు’ సినిమాతో ఫక్తు కమర్షియల్ హీరోగా మారారు. ఈ సినిమా అప్పట్లోనే రూ.3 కోట్ల మేర వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

యమలీల :
టాలీవుడ్‌లో కమెడియన్‌గా సైడ్ క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్న అలీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం ‘యమలీల’. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సోషియో ఫాంటసీ చిత్రంతో అలీ హీరోగా మారాడు. 1994 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం థియేటర్లలో 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

పోకిరి :
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ‘పోకిరి’ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పక్కా మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది కల్ట్ చిత్రంగా నిలిచిపోయింది.

బాహుబలి 2 :
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సంధించిన ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు 2017 ఏప్రిల్ 28న సమాధానం లభించింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ ‘బాహుబలి 2’ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.

ఇలా ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ చిత్రాలు టాలీవుడ్ చరిత్రలో సాలిడ్ హిట్స్‌గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.

Exit mobile version