మహేష్ బాబు సినిమాపై క్లారిటీ ఇచ్చిన మురుగదాస్

murugudas
ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో నటిస్తున్న హీరోయిన్ విషయంలో కొన్నిరోజులుగా కొన్ని వార్తలుసినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటంటే ఇందులో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు నయనతార కూడా నటిస్తుందని, ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయని వారాలొచ్చాయి.

కానీ దర్శకుడు మురుగదాస్ వీటి పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ ‘నా సినిమాలో మహేష్ సరసన కేవలం ఒక్క హీరోయిన్ మాత్రమే నటిస్తోంది. ఆమె రకుల్ ప్రీత్ సింగ్’ అన్నారు. దీంతో మహేష్ – నయనతారల కాంబియేషన్ పై వస్తున్న రూమర్లకు ఫులుస్టాప్ పడింది. ఇకపోతే నల్లమలుపు బుజ్జి. ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవికి విడుదల కానుంది.