టాక్..ఈ యంగ్ హీరోతో మురుగదాస్ ప్రాజెక్ట్.?

టాక్..ఈ యంగ్ హీరోతో మురుగదాస్ ప్రాజెక్ట్.?

Published on Feb 3, 2023 7:00 PM IST

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి పలు సీనియర్ అండ్ ప్రముఖ దర్శకుల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ కూడా ఒకరు. మరి తమిళ్ నుంచి శంకర్ తరహాలోనే మెసేజ్ కి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మురుగదాస్ తీసిన ఆల్ మోస్ట్ అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన లాస్ట్ సినిమా “దర్బార్” తర్వాత మాత్రం ఇంకా ఈ హీరోతో కూడా సినిమా తాను చేయలేదు.

కానీ పలువురు హీరోల పేర్లు తన లైనప్ లోకి వచ్చాయి. కానీ లేటెస్ట్ గా ఓ యంగ్ హీరో అయితే మురుగదాస్ తో చేసే ఛాన్స్ ఉన్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు శివకార్తికేయన్ నే అట. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం శివకార్తికేయన్ “మావీరన్” సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇది తెలుగులో మహావీరుడు పేరిట రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు