ఈ ఇద్దరు యంగ్ హీరోస్ లో మురుగదాస్ ఎవరితో?

Published on Mar 3, 2023 6:59 am IST

ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో ఒకరైన స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆసక్తిగా మారింది. ఎప్పటికప్పుడు పలు ఇంట్రెస్టింగ్ నేపథ్యాలతో సందేశాలతో వచ్చే మురుగ దాస్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన “దర్బార్” తర్వాత మళ్ళీ ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. దీనితో తన లైనప్ పై మరింత ఆసక్తి అయితే నెలకొంది.

కానీ గత కొన్ని రోజులు నుంచి యంగ్ హీరో శింబు తో అయితే ఓ సినిమా చేయనున్నట్టుగా టాక్ ఉంది. అలాగే మరో హీరో శివ కార్తికేయన్ తో కూడా మురుగదాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా బజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరితో అయితే మురుగదాస్ మొదట సినిమా చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం శింబు మరియు శివకార్తికేయన్ ఇద్దరు కూడా ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీనితో తాను ఏ హీరోతో ఫస్ట్ టేకప్ చేయనున్నారు అనేది కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తిగా నిలిచింది.

సంబంధిత సమాచారం :