
స్వతహాగా ఎఆర్ మురుగదాస్ తమిళవాడైనా ‘గజినీ’, ‘సెవెంత్ సెన్స్’, ‘స్టాలిన్’, ‘తుపాకి’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి మాత్రం సుపరిచితుడే.. మురుగదాస్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో తీస్తున్న ‘కత్తి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న మురుగదాస్ కాస్త అస్వస్థతకు గురయ్యారు.
అసలు విషయంలోకి వెళితే ఈ రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మురుగదాస్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. దాంతో ఈ చిత్ర టీం మురుగదాస్ ని వెంటనే చెన్నై లోని మలార్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ రోజు తిన్న ఫుడ్ వల్లే ఇలా జరిగిందని అక్కడ ఉన్న చిత్ర టీం చెబుతున్నారు. అలాగే మురుగదాస్ కి ప్రస్తుతం సీరియస్ కండిషన్ ఏమీ లేదని అంటున్నారు.
విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.