అద్భుతంగా “అల్లిపూల వెన్నెల” సాంగ్… బతుకుమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఏ ఆర్ రెహమాన్!

Published on Oct 5, 2021 8:16 pm IST

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జీవితం యొక్క పండుగ, ఐక్యత వేడుక అంటూ ఏ ఆర్ రెహమాన్ బతుకమ్మ పండుగ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్బంగా ఆల్లిపూల వెన్నెల పాటను సోషల్ మీడియా లో షేర్ చేశారు ఏ ఆర్ రెహమాన్. అల్లిపూల వెన్నెల పాట ను కంపోజ్ చేసి నిర్మించారు రెహమాన్. ఈ పాటకి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫి అందించగా, బ్రిందా ఈ పాటకి కొరియోగ్రఫీ చేసారు. మిట్టపల్లి సురేందర్ ఈ పాటకి లిరిక్స్ అధ్బుతంగా రాశారు అని చెప్పాలి. ఈ పాటలో మేఖ రాజన్, అనఘ, ఏంజెలీనా నటించారు. రక్షిత సురేష్, హరిప్రియ, దీప్తి సురేష్, అపర్ణ హారి కుమార్, పద్మజ లు ఈ పాటను పాడటం జరిగింది. ఇందులో ఉత్తర ఉన్ని కృష్ణన్ చైల్డ్ వాయిస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ మీద ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :