‘ఏఆర్‌ రెహమాన్‌’ కుమార్తెకి పెళ్లి.. వరుడు ఎవరంటే ?

Published on Jan 3, 2022 12:02 am IST

అరుదైన ఆస్కార్‌ అవార్డును గెలుచుకుని సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘ఏఆర్‌ రెహమాన్‌’. కాగా రెహమాన్‌ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ కు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. వరుడు పేరు రియా సిద్దీన్‌ షేక్‌ మహమ్మద్‌. ఖతీజా రెహమాన్‌ – రియా సిద్దీన్‌ షేక్‌ మహమ్మద్‌ డిసెంబర్‌ 29న నిశ్చితార్థం చైన్నైలో జరిగింది.

కాగా ఈ విషయాన్ని ఖతీజా తన సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇన్‌ స్టాలో ఖతీజా పోస్ట్ చేసిన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక రియా సిద్దీన్‌ షేక్‌ మహమ్మద్‌ ఇంజినీర్‌, ఎంటర్ ప్రెన్యూర్ అని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వివాహం ముహుర్తం ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :