రాజమౌళికి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన ఏఆర్. రెహమాన్ !

22nd, May 2017 - 09:28:49 AM


ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ రాజమౌళి మీద ప్రసంశల వర్షం కురిపించారు. తాజాగా చెన్నైలో ‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రాన్ని వీక్షించిన ఆయన రాజమౌళిని, సంగీత దర్శకుడు కీరవాణిని అభినందించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్ల వసూళ్లు సాధించాలని అన్నారు. అలాగే సౌత్ ఇండియన్ సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లి దానికి ఒక కొత్త గుర్తింపునిచ్చారని కూడా అన్నారు.

రెహమాన్ కాంప్లిమెంట్ కి ఫిధా అయిన రాజమౌళి మీ అభినందన మాకు చాలా ప్రత్యేకమైందని కృతజ్ఞతలు తెలిపారు. రెహమాన్ తాజాగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘సంఘమిత్ర’ మూవీ లాంచ్ సందర్బంగా కూడా బాహుబలి-2 ని గురించి ప్రస్తావించి రాజమౌళి అండ్ టీమ్ చేసిన కృషిని కొనియాడారు.