నాటు నాటు కి ఆస్కార్ పై ఏ ఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Mar 13, 2023 9:57 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో ఆస్కార్ అవార్డు ను సొంతం చేసుకుంది. ఈ అవార్డ్ గెలుపొందడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ లిస్ట్ లోకి ఏ ఆర్ రెహమాన్ చేరారు.

ఎంఎం కీరవాణి గారు, చంద్రబోస్ గారు కంగ్రాట్స్. ఊహించినట్లు గానే ఈ అవార్డ్ కి అర్హులు. మీ ఇద్దరికీ, ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కి జయహో అంటూ చెప్పుకొచ్చారు రెహమాన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :