అవును మహేష్…అతను చాలా ప్రతిభావంతుడు – ఏ ఆర్ రెహమాన్!

Published on Sep 27, 2021 11:57 am IST

నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం సర్వత్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. హీరో, హీరోయిన్ ల నటనను మెచ్చుకుంటూనే, ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన పవన్ సి హెచ్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

పవన్ సి హెచ్ గురించి మీరు చాలా ఎక్కువగా వింటారు. మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది, సెన్సేషనల్ అంటూ చెప్పుకొచ్చారు. అతను ఏ ఆర్ రెహమాన్ యొక్క శిష్యుడు అని విన్నాను, మీరు అతని గురించి గర్వ పడతారు సర్ అంటూ ఏ ఆర్ రెహమాన్ ను ఉద్దేశించి తెలిపారు. ఈ మేరకు ఏ ఆర్ రెహమాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును మహేష్ అతను చాలా ప్రతిభా వంతుడు మరియు వినయ పూర్వకమైన వాడు అని అన్నారు.చెన్నై లో మేమంతా అతని విజయం పట్ల నిజంగా గర్వ పడుతున్నాము అని అన్నారు.

సంబంధిత సమాచారం :