చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన ఆస్కార్ అవార్డు విజేత!

Published on Aug 16, 2022 9:00 am IST

అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇండస్ట్రీలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న అతని తొలి చిత్రం రోజా నిన్నటితో 3 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అతని హార్డ్‌కోర్ అభిమానులు ఈ మూమెంట్ ను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఏ ఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటో ను షేర్ చేయడం జరిగింది.

ఏ ఆర్ రెహమాన్ తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. 50 ఏళ్ల క్రితం అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది షేర్ చేసిన కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో కి భారీగా లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఫోటో లో క్యూట్‌గా మరియు అమాయకంగా కనిపిస్తున్నాడు రెహమాన్. వర్క్ ఫ్రంట్‌లో, స్టార్ కంపోజర్ అనేక ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్నాడు.

సంబంధిత సమాచారం :