రెహమాన్ చేతిలో మరొక భారీ చిత్రం !

ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహామన్ ప్రస్తుతం రజనీ, శంకర్ ల ‘2.0’ చిత్రానికి సంగీతం అందించి తదుపరి చిత్రం ‘సంఘమిత్ర’ కు సిద్ధమవుతున్నారు. ఈ రెండూ కాకుండా ఆయన చేతిలోకి మరో పెద్ద ప్రాజెక్ట్ చేరింది. అదే ‘మహాభారత’. డా. బి. ఆర్.శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రూపుదిద్దుకోనున్న భారతీయ చిత్రాల్లో అతిపెద్దది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘భీమ’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా రూపొందిసిన్హానున్నారు. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలై 2020 నాటికి పూర్తికానుంది.