కృష్ణా జిల్లాలో కొత్త సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

12th, September 2017 - 10:48:05 AM


ఈ సెప్టెంబర్లో విడుదలైన మూడు చిత్రాల కలెక్షన్స్ కృష్ణా జిల్లా పరిధిలో ఈ కింది విధంగా ఉన్నాయి. ముందుగా బాలకృష్ణ ‘పైసా వసూల్’ విషయానికొస్తే నిన్న 12వ రోజు రూ. 51,333 కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తంగా రూ.1. 13 కోట్ల షేర్ ను రాబట్టింది. నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ సోమవారం రూ.2.32 లక్షలు వసూలు చేసి ఇప్పటి వరకు రూ. 29.36 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

అలాగే విజయ్ దేవరకొండ సూపర్ హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ ఇప్పటికీ స్టడీగానే కొనసాగుతూ సోమవారం రూ.86,078 వసూలు చేసి 18 రోజులకు కలిపి రూ.1. 06 కోట్లు జమచేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటపట్టారు. ఇక అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి’ చిత్రం సోమవారం రూ.2.22 లక్షలు వసూలు చేసి 4 రోజులకు కలిపి రూ.19.9 లక్షల్ని ఖాతాలో వేసుకుంది.