అదరగొడుతున్న “అరబిక్ కుతు” సాంగ్..!

Published on Feb 15, 2022 1:00 am IST

కోలీవుడ్ అభిమానులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “బీస్ట్”. తమిళ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘అరబిక్ కుతూ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే వాలంటైన్స్ డే సందర్భంగా “అరబిక్ కుతు” ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ పాటను అనిరుధ్ ఆలపించగా, శివకార్తికేయన్ సాహిత్యం అందించాడు. అరబిక్ పదాలే కాకుండా తమిళ్ పదాలను కూడా ఈ పాటలో వాడారు. ఇందులో విజయ్, పూజా డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :