“అరబిక్ కుతు” సెన్సేషనల్ రికార్డ్..!

Published on Mar 14, 2022 10:05 pm IST


అరబిక్ కుతు అని కూడా పిలువబడే హలమతి హబీబో అనే పాట ఎప్పటికైనా ఆగదని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ బీస్ట్ లోని మొదటి పాట మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పాటను యూ ట్యూబ్ లో ఎక్కువ మంది లైక్ చేసిన ఇండియన్ సాంగ్ గా నిలిచింది.

ఇప్పటి వరకూ ఈ పాటకు యూ ట్యూబ్ లో 4.6 మిలియన్ల కి పైగా లైక్‌లను దాటింది. అలాగే, తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ పాట ఇదే అని చెప్పాలి. అరబిక్ కుతు అత్యంత ఇష్టపడే లిరికల్ వీడియోగా రూపుదిద్దుకోవడానికి కేవలం 28 రోజులు మాత్రమే పట్టింది. ఈ సమయంలో పాట 173 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించిందని గమనించాలి. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు నటుడు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్ చిత్రం కి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :