మరో సెన్సేషనల్ మార్క్ అందుకున్న “అరబిక్ కుతు”.!

Published on Feb 23, 2023 8:59 am IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “బీస్ట్” కోసం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని సాలిడ్ సాంగ్స్ గాని నెక్స్ట్ లెవెల్లో హిట్స్ అయ్యాయి. ఇక ఆ సాంగ్స్ లో అయితే అరబిక్ కుతు కూడా ఒకటి కాగా ఈ సాంగ్ అయితే ఇప్పటికీ అనేక రికార్డులు నెలకొల్పుతుంది.

లేటెస్ట్ గా ఈ సాంగ్ అయితే ఏకంగా 400 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది విజయ్ మరియు సౌత్ ఇండియా సినిమా దగ్గర మరో సెన్సేషనల్ రికార్డు కాగా దీని హవా ఇంకా కొనసాగుతుంది. దీనితో ఈ సాంగ్ ట్యాగ్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్ గా మారింది. ఇక ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ నిర్మాణం వహించగా విజయ్ కెరీర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

సంబంధిత సమాచారం :