ఓటీటీలోకి రానా ‘అర‌ణ్య‌’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

ఓటీటీలోకి రానా ‘అర‌ణ్య‌’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Published on Oct 15, 2021 3:00 AM IST


రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’. ఈ ఏడాది మార్చి 26న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ద‌స‌రా కానుక అక్టోబ‌ర్ 15 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా ప్ర‌సారం కానుంది.

అయితే ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ స‌మీపంలోని చిల‌క‌ల‌కోన అడ‌విలో ఏనుగుల్ని ర‌క్షించే ఓ కుటుంబంలో న‌రేంద్ర ‌భూప‌తి (రానా) పుట్టి పెరుగుతాడు. అడ‌వి, ఏనుగుల ర‌క్షణ కోసం పాటు ప‌డుతున్నందుకు రానాకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రప‌తి పుర‌స్కారం కూడా లభిస్తుంది. అయితే అట‌వీ శాట మంత్రి అడ‌విని నాశ‌నం చేసి అక్క‌డ డీఆర్‌ఎల్‌ టౌన్‌షిప్‌ని నిర్మించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ప్రకృతి ప్రేమికుడు అరణ్య దానిని ఏ విధంగా అడ్డుకున్నాడు? అనేదే సినిమా పూర్తి కథ. ఇదిలా ఉంటే ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు