‘ధృవ’ సినిమాలో నటించడానికి కారణం ఏమిటో చెప్పిన అరవింద స్వామి !

arvind-swamy
సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ధృవ’ చిత్రం విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రముఖ నటుడు అరవింద స్వామి చాలా ఎళ్ళ తరువాత తెలుగు ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. అలాగే తన అద్భుతమైన నటనతో సినిమా విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. తమిళంలో వర్షన్ ‘తనీ ఒరువన్’ లో మొదట విలన్ నటించిన అరవింద స్వామి తెలుగు వర్షన్ ‘ధృవ’ లో కూడా నటించడానికి గల కారణాలను తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బయటపెట్టారు.

‘మొదట తమిళ వర్షన్ తనీ ఒరువన్ కథ విన్నాక దాని మీద చాలా వర్కవుట్ చేశాను. ఆ డిఫరెంట్ నెగెటివ్ రోల్ నాకు బాగా నచ్చింది. అందుకే అది అంత బాగా సక్సెస్ అయింది. ఇక సురేందర్ రెడ్డి తెలుగులో కూడా అదే పాత్రలో నటించమని అడగ్గానే కథలో, పాత్రలో ఎలాంటి మార్పు ఉండదు కనుక, అప్పటికే స్క్రిప్ట్ మీద ఫుల్ వర్కవుట్ చేశాను గనుక పైగా డిఫరెంట్ టీమ్, డిఫరెంట్ ఆడియన్స్ తో పని చేసే ఛాన్స్ రావడం వంటి కారణాలవలన స్’ధృవ’ లో నటించడానికి ఒప్పుకున్నాను’ అని అరవింద స్వామి తెలిపారు. అలాగే త్వరలో తానూ చేయబోయే సినిమా వివరాలు, తన డైరెక్షన్ ప్లాన్స్ గురించి కూడా ముచ్చటించారు.