అరవింద సమేత లేటెస్ట్ అప్డేట్స్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈచిత్రం అక్టోబర్ 2న సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోనుంది. ఇక ఈచిత్రంలో హెవీ యాక్షన్ సీక్వెన్స్ ఉండడంతో చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 6న గ్రాండ్ గా జరిపి చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదలచెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.

త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క ఆడియో కి మంచి రెస్పాన్స్ వస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

Exit mobile version