అరవింద ప్రీ రిలీజ్ వేడుక అప్డేట్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ వేడుక ను అక్టోబర్ 1న గాని లేదా గాంధీ జయంతి రోజు 2వ తేదీన గాని జరుపాలని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. అయితే ఈ వేడుకకు ఇంకా వేదికను ఖరారు చేయాల్సి వుంది.

ఇక ఈ చిత్రం యొక్క ఆడియో ఈ రోజు విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పక్క రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈషా రెబ్బా , నాగబాబు , జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version