
ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల ఫ్యాక్షన్ డ్రామా ‘అరవింద సమేత’ సోమవారం కూడా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం నిన్న 3కోట్ల ఫై చిలుకు షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇక 5రోజులకుగాను ఈచిత్రం తెలంగాణ మరియు ఏపీలో 50కోట్ల షేర్ ను రాబట్టుకుంది.
ఇకఈ చిత్రం అటు యూఎస్ లోకూడా మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రాన్ని అక్కడ 12కోట్లకు అమ్మగా నాలుగు రోజుల్లోనే 10కోట్ల కు పైగా కలెక్ట్ చేసింది. తమన్ సంగీతం అందించిన ఈచిత్రంలో ఎన్టీఆర్ నటన తో పాటు జగపతి బాబు పోషించిన ప్రతినాయకుడి పాత్ర చిత్ర విజయంలో కీలక పాత్రను పోషించాయి.