నవంబర్ 13న తెలుగు హీరోయిన్ పెళ్లి !

archhana

హీరోయిన్ అర్చన (వేద) త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు జగదీశ్‌ తో అర్చన నిశ్చితార్థం అక్టోబర్ 3వ తేదీన బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

కాగా నవంబర్ 13న అర్చన – జగదీశ్‌ పెళ్లి హైదరాబాద్ లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఘనంగా జరగనుంది. ఇక అర్చన జన్మతహ తెలుగు అమ్మాయి. అయితే ఆమె తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొనింది.

Exit mobile version