ఆ విషయమై నిరాశ లో ప్రభాస్ ఫ్యాన్స్ ?

Published on Sep 12, 2023 1:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ కూడా ఒకటి. ఈ మూవీ పై అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవల కొన్నాళ్ల క్రితం ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ని వేశారు.

అధికారికంగా వాయిదా ప్రకటన రానప్పటికీ పలు ఇతర సినిమాలు అదే డేట్ న రిలీజ్ కి సిద్దమవడంతో పక్కాగా సలార్ వాయిదా అని తెలుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే, గత కొన్నాళ్లుగా సలార్ యొక్క తాజా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ ఉంటే ఈపాటికి సాంగ్స్, ట్రైలర్ వచ్చేవని, కానీ ఇంకా తాజా రిలీజ్ డేట్ పై సలార్ మేకర్స్ స్పందించకపోవడంతో పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిరాశతో కామెంట్స్ చేస్తున్నారు. మరి సలార్ మేకర్స్ ఎప్పుడు దీని పై స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :