“భీమ్లా నాయక్” నుంచి మాస్ పోస్టర్ కి సిద్ధమా.?

Published on Jan 15, 2022 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ మసాలా డ్రామా “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ చిత్రం అన్నీ బాగుండి ఉంటే మొన్ననే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై మాత్రం మేకర్స్ ఎప్పటికప్పుడు డిజప్పాయింట్ చెయ్యకుండా కీలక అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు.

అలాగే ఈ పండుగ మహోత్సవానికి ఏదొక అప్డేట్ ని అభిమానులు ఆశిస్తుండగా ఈరోజు మాత్రం మేకర్స్ ఒక సాలిడ్ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ టాక్ ఆసక్తికరంగా వినిపిస్తుంది. దీనితో అంతా ఈ మాస్ పోస్టర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఈసారి ఎలాంటి హై ఎక్కించే పోస్టర్ ని రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నాగవంశీ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :