“ఢీ 13” గ్రాండ్ ఫినాలే..ఐకాన్ స్టార్ మాస్ ప్రెజెన్స్ ని మిస్ అయ్యేది లే.!

“ఢీ 13” గ్రాండ్ ఫినాలే..ఐకాన్ స్టార్ మాస్ ప్రెజెన్స్ ని మిస్ అయ్యేది లే.!

Published on Dec 8, 2021 4:50 PM IST

తెలుగు బుల్లితెర ఛానెల్స్ లో టాప్ మోస్ట్ ఛానెల్ అయినటువంటి ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే అతి పెద్ద డాన్స్ షో ఢీ 13వ సీజన్ ఈరోజు తో ముగియనుంది. మరి ఈ గ్రాండ్ ఎపిసోడ్ కి గాను టాలీవుడ్ డాన్సింగ్ డైనమైట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అయ్యిన సంగతి తెలిసిందే.

మరి ఈరోజు ఎపిసోడ్ లో బన్నీ మాసివ్ ఎంట్రీ ఉండబోతుంది దీనితో అంతా చాలా ఆసక్తిగా ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో కళ్ళు చెదిరే డాన్స్ లు, సుధీర్, రష్మీ టీం ల ఫన్నీ టాస్కులు, వీటిని మించి బన్నీ మాస్ ప్రెజెన్స్ తో టెలికాస్ట్ కి రెడీగా ఉంది.

మరి ఈ ఫినాలే లో ఫైనలిస్టులుగా ఉన్న కార్తీక్ మరియు కావ్య శ్రీ లలో ఐకాన్ స్టార్ ఎవరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తాడో? సుధీర్ – ఆది, రష్మీ – దీపికా ల టీం లలో ఎవరు ఈసారి టైటిల్ కొట్టబోతున్నారో తెలియాలి అంటే ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీ ఛానెల్లో మిస్సవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ గ్రాండ్ షో కి వ్యాఖ్యాతగా ప్రదీప్ చేస్తుండగా న్యాయ నిర్ణేతలుగా పూర్ణ, గణేష్ మాస్టర్ అలాగే ప్రియమణి లు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు