ఓజీ: నెక్స్ట్ టైమ్ బెటర్ గా ట్రై చేస్తా – అర్జున్ దాస్

Published on Sep 5, 2023 9:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. ఈ చిత్రం కి సంబందించిన గ్లింప్స్ వీడియో ను మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. తెలుగు తో పాటుగా, తమిళ, హిందీ భాషల్లో కూడా ఆడియెన్స్ కి అందుబాటులో ఉంది. ఈ గ్లింప్స్ వీడియో కి, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అర్జున్ దాస్ వాయిస్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అని మనకి తెలిసిందే.

అయితే ఒక అభిమాని తమిళ్ లో మీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ అంటూ చెప్పుకొచ్చారు. అందుకు అర్జున్ దాస్ రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ తెలుగు, హిందీ భాషల్లో బెటర్ గా ట్రై చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :