“ఓజి” పై పవన్ కామెంట్స్…అర్జున్ దాస్ ఏమన్నారంటే?

“ఓజి” పై పవన్ కామెంట్స్…అర్జున్ దాస్ ఏమన్నారంటే?

Published on Jul 4, 2024 2:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిసారిగా బ్రో చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానుల్ని విశేషం గా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ కమిటిమెంట్స్ కారణంగా సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చారు పవన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం గా పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అయితే తాజాగా ఓజి చిత్రం పై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓజి చూద్దురు గానీ, బాగుంటుంది అంటూ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ చిత్రం కి సంబందించిన గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేసిన టైమ్ లో సెన్సేషన్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ దాస్ బేస్ వాయిస్ తో టీజర్ ను ఓ లెవెల్లో ఎలివేట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి చిన్న రిప్లై ఇచ్చారు. “అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే” అంటూ చెప్పుకొచ్చారు. ఇది టీజర్ లో అర్జున్ దాస్ చెప్పిన డైలాగ్. మరోసారి ఓజి మూవీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు