మలైకా ని పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను – అర్జున్ కపూర్‌

Published on Aug 12, 2022 6:33 pm IST

అర్జున్ కపూర్ తన కంటే 15 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ న్యూస్ అప్పట్లో ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ జంట గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉండటంతో ఇప్పుడు పెళ్లి ప్రశ్న తలెత్తింది.

కాఫీ విత్ కరణ్ షోలో అర్జున్, మలైకాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని అడిగారు. సమయం వృధా చేయకుండా, ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే మూడ్ లేదని, కేవలం ఆ లేడీతో డేటింగ్‌ పైనే ఆసక్తి చూపుతున్నానని అర్జున్ కపూర్ చెప్పాడు. అర్జున్ కూడా కెరీర్‌లో సెటిల్ అవ్వాలని, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలని అంటున్నారు. ఈ న్యూస్ తో మరోసారి వీరి టాపిక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :