పుష్ప పై పొగడ్తలు కురిపించిన బాలీవుడ్ హీరో !

Published on Jan 9, 2022 7:59 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప- ది రైజ్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘పుష్ప థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సక్సెస్‌ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇక థియేటర్‌లో ఈ సినిమా చూడని చాలామంది అమెజాన్‌ ప్రైమ్‌లో చూస్తున్నారు. తాజాగా అర్జున్‌ కపూర్‌ సినిమా చూసి పుష్ప పై స్పందిస్తూ.. పుష్ప అంటే నిజంగా ఫైరే అని తన ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టాడు.

అలాగే అర్జున్‌ కపూర్‌ తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అని, ఆర్య నుండి బన్నీని ఇష్టపడుతున్నాను అని, ఇక పుష్ప నార్మల్‌ సినిమా కాదు అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. బన్నీ నటన చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ రోజు సాయంత్రం మంచు లక్ష్మి కూడా పుష్పలో బన్నీ నటన చూసి థ్రిల్ అయిపోతూ పాజిటివ్ మెసేజ్ చేసింది.

సంబంధిత సమాచారం :