అల్లు అర్జున్ కి పోటీ ఇచ్చే విలన్ గా అర్జున్.!

allu-arjun-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’, ‘ ఐ యామ్ దట్ చేంజ్'(షార్ట్ ఫిల్మ్) సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అతిత్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఓ ప్రత్యేకమైన న్యూస్ ని మీకందిస్తున్నాం.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి గట్టి పోటీని ఇచ్చే విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. అర్జున్ చేయనున్న నెగటివ్ షేడ్స్ పాత్ర సినిమాకి ఒక హైలైట్ అవుతుందని సమాచారం. పవర్ఫుల్ యాక్షన్ రోల్స్ చేయడంలో అర్జున్ కి మంచి పేరుండడంతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ గా స్టంట్స్ పై స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు ఆడిపాడనున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా తెలియజేయనున్నారు.

Exit mobile version