‘అర్జున్ రెడ్డి’ 5వ రోజు నైజాం కలెక్షన్లు !


ఈ ఏడాది తెలుగు పరిశ్రమలో నమోదైన హిట్ సినిమాలు జాబితాలో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రం కూడా చేరిపోనుంది. మొదటి రోజున నుండే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా పట్ల యువత మరీ క్రేజీగా ఉన్నారు. సినిమా ఆడుతున్న ప్రతి స్క్రీన్లో మెజారిటీ యువతే ఉంటున్నారు. అందుకే అన్ని చోట్ల చిత్రం బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది.

ముఖ్యంగా తెలంగాణాలో అయితే ప్రేక్షకాదరణ మరీ ఎక్కువగా ఉంది. మొదటి రోజు రూ. 1.41కోట్లు రాబట్టిన ఈ సినిమా 2వ రోజు రూ.1. 1 కోట్లు, 3వ రోజు రూ. 1.09 కోట్లు, 4వ రోజు రూ .86 లక్షలు, 5వ రోజు రూ .71 లక్షలు వసూలు చేసిన సినిమా మొత్తంగా రూ.5.17 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సినిమాలోని హీరో, దర్శకుడితో పాటు ఇతర నటీ నటులకు, టెక్నీషియయన్లకు కూడా మంచి బ్రేక్ దొరికినట్టైంది.