‘అర్జున్ రెడ్డి, వివేకం’ కృష్ణా జిల్లా వసూళ్ల వివరాలు !


గతవారం తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’తో పాటు మరో రెండు తమిళ సినిమాలు ధనుష్ ‘వీఐపి-2’, అజిత్ ‘వివేకం’ విడుదలయ్యాయి. ఈ మూడింటిలో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రం మంచి హిట్ గా నిలవగా మిగిలినవాటిలో ‘విఐపి-2’ పర్వాలేదనిపిస్తుండగా ‘వివేకం’ మాత్రం నిరుత్సాహకరంగా సాగుతోంది.

కలెక్షన్లకు ముఖ్యమైన ఏరియా కృష్ణా జిల్లాలో వసూళ్లను చూసినట్లైతే 5వ రోజు రూ.6. 96 లక్షలు వసూలు చేసిన ఈ’అర్జున్ రెడ్డి’ 6వ రోజు రూ.5.03 లక్షలు రాబట్టి మొత్తంగా రూ.75.33 లక్షలు ఖాతాలో వేసుకోగా ‘విఐపి-2’ 6వ రోజు రూ.1.42 లక్షలు వసూలు చేసి మొత్తం షేర్ రూ24.15 లక్షలు నమోదుచేసింది. అలాగే ‘వివేకం’ 7వ రోజు రూ.40,636 రాబట్టి మోతంగా రూ.22.03 లక్షల షేర్ ను అందుకుంది.