కృష్ణా జిల్లాలో కొత్త సినిమాల వసూళ్ల వివరాలు !


విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగ రూపొందించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోట చిత్ర వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ముఖ్యమైన ఏరియా అయిన కృష్ణా జిల్లాలో నిన్న మూడవ రోజు రూ. 14. 47 లక్షల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం మొత్తంగా రూ. 55.25 కోట్లను వసూలు చేసింది.

అలాగే తాప్సి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ‘ఆనందో బ్రహ్మ’ కూడా కృష్ణా జిల్లాలో మంచి హిట్ గా నిలిచింది. 10వ రోజు కూడా 3 లక్షల షేర్ ను వసూలు చేసి మొత్తంగా రూ. 31.9 లక్షలను ఖాతాలో వేసుకుంది. అది కూడా ఓకే సింగిల్ స్క్రీన్ 8 మల్టీ ప్లెక్సుల్లోనే కావడం విశేషం. ఇక డబ్బింగ్ చిత్రమైన అజిత్ ‘వివేకం’ 4వ రోజు రూ.2. 79 లక్షల్ని వసూలు చేసి మొత్తం నాలుగు రోజులకు గాను రూ. 20.2 లక్షల్ని నమోదు చేసింది.