కృష్ణా జిల్లాలో ‘అర్జున్ రెడ్డి, ఆనందో బ్రహ్మ’ చిత్రాల పరిస్థితి !


గత వారం విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం, ఆ ముందు వారం విడుదలైన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. రొటీన్ కు భిన్నంగా రూపొందిన ఈ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు అసలు తెచ్చిపెట్టిన ఈ రెండు చిత్రాలు భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రమైతే డిస్ట్రిబ్యూటర్లకు పంట పండిస్తోంది.

కలెక్షన్లకు కీలకమైన, ఎక్కువ సినిమా ప్రభావం కలిగిన కృష్ణా జిల్లా విషయానికొస్తే రెండవరోజు 15.8 లక్షలు రాబట్టిన ‘అర్జున్ రెడ్డి’ రెండు రోజులకు కలుపుకుని 40. 7 లక్షలు వసూలు చేసింది. అలాగే యూఎస్ లో కూడా ఈరోజుటితో సినిమా మిలియన్ మార్క్ అందుకుంటుందని కూడా అంటున్నారు.
ఇక ‘ఆనందో బ్రహ్మ’ విషయానికొస్తే 9వ రోజైన శనివారం 2.6 లక్షలు కలెక్ట్ చేసిన ఈ చిత్రం 28.9 లక్షల షేర్ ను రాబట్టుకుంది.