బాలయ్యను బీట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ !

11th, September 2017 - 04:36:12 PM


విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ అన్ని ఏరియాల్లోను అద్భుతమైన రన్ చూపిస్తూ మంచి వసూళ్లను రాబడుతోంది. దాదాపు అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాల దిశగా దూసుకెళుతున్నారు. నిన్న ఆదివారం వరకు 1.68 మిలియన్ డాలర్లను రాబట్టిన ఈ చిత్రం టాప్ టెన్ తెలుగు సినిమాల్లో చోటు సంపాదించుకుంది.

అంతేగాక బాలకృష్ణ యొక్క ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వసూళ్లను కూడా అధిగమించేదసింది. శాతకర్ణి లైఫ్ టైమ్ వసూళ్లు 1.66 మిలియన్ డాలర్లుగా ఉండగా ‘అర్జున్ రెడ్డి’ రూ.1. 68 మిలైన మార్కును చేరుకుంది. ఇక దీని ముందు 1.8 మిలియన్ డాలర్లతో ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, 1.89 మిలియన్ డాలర్లతో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రాలున్నాయి. ఫుల్ రన్ ముగిసేసరికి సందీప్ వంగ సినిమా ‘జనతా గ్యారేజ్’ లేదా రెండింటినీ దాటేసే అవకాశాలున్నాయి.