తెలుగు రాష్ట్రాల్లో ‘అర్జున్ రెడ్డి’ చేసిన వసూళ్లు ఎలా ఉన్నాయంటే!


ఈ మధ్య కాలంలో విడుదలైన ‘ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, ఆనందో బ్రహ్మ’ వంటి సినిమాలు మంచి విజయాల్ని, లాభసాటి కలెక్షన్లు సాధించగా ఆ సక్సెస్ ను కొనసాగించడానికి అన్నట్లు ‘అర్జున్ రెడ్డి’ చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నూతన దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ’ నటించిన ఈ సినిమా మొదట మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.15 కోట్లు వసూలు చేసింది.

ప్రాంతాల వారీగా వసూళ్ల వివరాలను చూస్తే

ఏరియా కలెక్షన్స్
నైజాం 3.58 కోట్లు
సీడెడ్ 95 లక్షలు
నెల్లూరు 18 లక్షలు
గుంటూరు  45 లక్షలు
కృష్ణా 55 లక్షలు
వెస్ట్ గోదావరి 25 లక్షలు
ఈస్ట్ గోదావరి 54 లక్షలు
వైజాగ్ 65 లక్షలు
మొత్తం
7. 15 కోట్లు