పోలీస్ స్టేషన్ కు ‘అర్జున్ రెడ్డి’ చిత్ర దర్శకుడు !
Published on Aug 22, 2017 5:03 pm IST


ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘అర్జున్ రెడ్డి’ సినిమా హవానే కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ తో పాటు నిన్న జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా సంచలనంగా మారాయి. కొందరు సినిమా తీసిన విధానాన్ని, విజయ్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తుంటే ఇంకొందరు మాత్రం తెగ మెచ్చుకుంటున్నారు. మరోవైపు సినిమాకు సంబందించిన లిప్ లాక్ పోస్టర్ల వ్యవహారం కూడా వేడెక్కింది.

ప్రమోషన్లలో భాగంగా టీమ్ సిటీ బస్సుల మీద వేసిన లిప్ లాక్ పోస్టర్లు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కొందరు మహిళా సంఘాల నేతలు పోలీసులకు పిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను విచారణ నిమిత్తం స్టేషన్ కు పిలిచినట్లు సమాచారం. నిన్న కూడా సీనియర్ పొలిటీషియన్ వి. హనుమంతరావు ఈ పోస్టర్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసి వాటిని చింపేసిన సంగతి తెల్సిందే. అభ్యంతరాలన్నీ ఎలా ఉన్నా శుక్రవారం విడుదలకానున్న చిత్రానికి ఈ ఘటనలన్నింటితో కావలసినంత పబ్లిసిటీ మాత్రం లభిస్తోంది.

 
Like us on Facebook