నెల్లూరులో అనారోగ్యానికి గురైన షాలిని పాండే !


షాలిని పాండే.. ప్రస్తుతం ఈమె పేరు తెలియని యువతీ యువకులు ఉండరేమో. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో ఆమె నటనకుగాను అంతలా ముగ్దులైపోయారు ప్రేక్షకులు. ఈ చిత్రంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి కూడా. ఒక్కసారిగా ఇంత స్టార్ స్టేటస్ రావడంతో ఆమెను నెల్లూరులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఒక సెల్ షోరూం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సదరు నిర్వాహకులు.

షాలిని కూడా ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. కానీ కార్యక్రమం మధ్యలో ఆమె అస్వస్ధకులం గురై స్పృహ కోల్పోయారట. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను సమీపంలోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాధమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం షాలినీ పాండే కోలుకున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఈమె ‘మహనటి’ చిత్రంతో పాటు ‘100% లవ్’ తమిళ రీమేక్ ‘100% కాదల్’ లో కూడా నటించనుంది.