మిలియన్ మార్కుకి దగ్గర్లో ‘అర్జున్ రెడ్డి’ !


విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోట యువతి ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో అన్ని షోలు దాదాపు హౌజ్ ఫుల్ గా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులైతే సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. దీంతో విడుదలైంది కొద్ది లోకేషన్లలోనే అయినా కలెక్షన్లు మాత్రం ఎక్కువ మొత్తంలోనే వస్తున్నాయి.

శనివారం రోజున 79 లొకేషన్ల నుండి 2.8 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొత్తం మీద 7.4 లక్షల డాలర్లను రాబట్టింది. దీంతో ఈ ఆదివారం ముగిసేసరికి చిత్రం మిలియన్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతమ్ చిత్రం ఫుల్ రన్ కలెక్షన్లు భారీ మొత్తంలోనే ఉండనున్నాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు.