లైగర్ తో అర్జున్ రెడ్డి మ్యానియా రిపీట్ కానుందా?

Published on Jul 31, 2022 6:13 pm IST


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా లైగర్. ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తుండటం విశేషం. పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ లో గేమ్ చేంజర్ అనడం లో ఎలాంటి సందేహ లేదు. అయితే ఆ చిత్రం ఆగస్ట్ 25 న విడుదలైంది. మళ్ళీ అదే ఆగస్ట్ 25 కి లైగర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అదే మ్యానియా రిపీట్ అవుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :