ఓవర్సీస్లో ‘అర్జున్ రెడ్డి’ హవా అలాగే ఉంది !


‘అర్జున్ రెడ్డి’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో ఓవర్సీస్లో ఉన్న ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తున్నారు. మొదటి నాలుగు రోజుల్లోనే మిలియన్ మార్కును అవలీలగా దాటేసిన ఈ సినిమా ఇప్పటికీ బలమైన వసూళ్లను రాబడుతోంది. నిన్న శనివారం కూడా 98 వేల డాలర్లను రాబట్టి మొత్తంగా 1. 37 మిలియన్ డాలర్ల వరకు వసూలుచేసింది. ఈ లెక్కలతో విజయ్ గత సినిమా ‘పెళ్లి చూపులు’ యొక్క 1. 2 మిలియన్ డాలర్ మార్కును అధిగమించేసింది.

పెద్ద పెద్ద హీరోల సినిమాలకే కష్టంగా ఉన్న ఈ నెంబర్ ను ఈ చిత్రం ఇంత సులభంగా అందుకోవడం ఒక విశేషమైతే ఒక ‘A’ సర్టిఫికెట్ కలిగిన చిత్రం ఇంతలా ఆదరణ పొందడం ఇంకో విశేషం. ఇకపోతే ఇంకొద్ది రోజుల్లో 1.5 మిలియన్ డాలర్ మార్కును అందుకోనున్న ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లను కొల్లగొడుతుందా లేదా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.