‘పైసా వసూల్, అర్జున్ రెడ్డి’ కృష్ణా కలెక్షన్స్ !

10th, September 2017 - 11:03:38 AM


చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రభంజనమే సృష్టించిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ముఖ్యంగా కుర్రకారు ఈ సినిమాకు అడిక్ట్ అయిపోయారు. దీంతో ఈ సినిమా వీక్ డేస్, హాలీడేస్ అనే తేడా లేకుండా కలెక్షన్లను అదరగొడుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు నిన్న 16వ రోజు కృష్ణాలో రూ. 1.49 లక్షలు రాబట్టి మొత్తంగా రూ.1.02 కోట్ల షేర్ ను నమోదు చేసింది.

ఇక మరొక పెద్ద సినిమా బాలయ్య ‘పైసా వసూల్’ కృష్ణాలో ఆరంభంలో, వినాయక్ చవితి పండుగ సెలవుల్లో మంచి వసూళ్లనే రాబట్టినా ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. 8వ రోజు అనగా గత శుక్రవారం రూ.87,475 ను రాబట్టిన ఈ చిత్రం 9వ రోజు శనివారం రూ.99,085 రాబట్టి మొత్తంగా రూ. 1.10 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.