‘అర్జున్ రెడ్డి, పైసా వసూల్’ కృష్ణా జిల్లా వసూళ్ల వివరాలు !


ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హట్ గా నిలిచి మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. నిన్నటితో యూఎస్ లో 1.5 మిలియన్ మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రన్ ను కనబరుస్తోంది. కృష్ణా జిల్లాలో నిన్న 11వ రోజు రూ.2.39 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా మొత్తంగా రూ.94 లక్షల షేర్ ను నమోదుచేసింది.

ఇక గత వారం విడుదలైన బాలయ్య ‘పైసా వసూల్’ ఏ సెంటర్లలో అంతంత మాత్రంగానే ఉన్నా బి, సి సెంటర్లలో బాగానే ఆదరణ పొందుతోంది. నిన్న 4వ రోజు కృష్ణా జిల్లాలో రూ.6.13 లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా రూ.1. 02 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే మరొక హిట్ సినిమా ‘ఫిదా’ నిన్న 46వ రోజు రూ.35,789 రాబట్టి మొత్తంగా రూ.2.17 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.