‘అర్జున్ రెడ్డి, పైసా వసూల్’ కృష్ణా జిల్లా వసూళ్ల వివరాలు!


గతావ్ శుక్రవారం విడుదలైన బాలయ్య – పూరిల చిత్రం ‘పైసా వసూల్’ మాస్ ఆడియన్సులో మంచి ఆదరణ పొందుతోంది. మొదటి రోజు భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో శనివారం నాడు రూ. 23 లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా మూడవ రోజు కూడా రూ. 20 లక్షల షేర్ ను రాబట్టి మొత్తంగా రూ.95.9 లక్షలను ఖాతాలో వేసుకుంది.

అలాగే మరొక హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ కృష్ణాలో 10వ రోజైన నిన్న రూ.5,01,892 వసూలు చేసి మొత్తంగా రూ.91.6 లక్షలను కొల్లగొట్టింది. ఇక మరొక హిట్ సినిమా ‘ఆనందో బ్రహ్మ’ కృష్ణా జిల్లలో 17వ రోజైన నిన్న రూ.1.47 లక్షలు రాబట్టి మొత్తంగా రూ.39 లక్షల షేర్ ను రాబట్టుకుంది. అది కూడా ఒక సింగిల్ స్క్రీన్, 8 మల్టీ ప్లెక్సుల్లో కావడం విశేషం.