1.5 మిలియన్ మార్కును అందుకున్న ‘అర్జున్ రెడ్డి’!

5th, September 2017 - 09:19:58 AM


తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సైతం కళ్లుచెదిరే కలెక్షన్లను సాధిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే మిలియన్ మార్కును అందుకున్న ఈ సినిమా నిన్న సోమవారం నాటికి 1.5 మిలియన్ మార్కును చేరుకుంది.

అది కూడా సాధారణ టికెట్ రేట్లతో, లిమిటెడ్ స్క్రీన్లతో కావడం విశేషం. దీంతో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్వాణ సినిమాస్ భారీ లాభాలను ఆర్జిస్తోంది. ఇప్పటికీ స్టడీ రన్ ను కొనసాగిస్తున్న ఈ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకుంటుందో లేదో చూడలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఏడాది ‘ఖైదీ నెం 150, బాహుబలి-2, గౌతమిపుత్ర శాతకర్ణి, ఫిదా’ వంటి సినిమాల తర్వాత 1.5 మిలియన్ మార్కును అందుకున్న 5వ చిత్రంగా ‘అర్జున్ రెడ్డి’ నిలిచింది.