1.75 మిలియన్ మార్కును అందుకున్న అర్జున్ రెడ్డి !
Published on Sep 18, 2017 8:38 am IST


విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తోంది. ఆ చిత్రం విడుదలైన దగ్గర్నుంచి ఇప్పటి దాకా మరో తెలుగు సినిమా అక్కడి ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా లేకపోవడంతో ‘అర్జున్ రెడ్డి’ కి తిరుగులేకుండా పోయింది. శనివారం రోజు $19,332 వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో 1. 75 మిలియన్ మార్కును అందుకుంది.

స్టార్ హీరోల సినిమాలకు కూడా కొంచెం పెద్ద టార్గెటే అయిన ఈ మొత్తాన్ని ‘అర్జున్ రెడ్డి’ అవలీలగా అందుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లను చూస్తే దాదాపు రూ. 23 కోట్ల వరకు ఉన్నాయి. ఇతర పరిశ్రమల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విపరీతంగా ఇష్టపడటంతో అక్కడి స్టార్ హీరోలు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసే పనిలో పడిపోయారు. సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు ప్రణయ్ వంగ నిర్మించారు.

 
Like us on Facebook